భారీ పెట్టుబడులు ప్రకటించిన హైదరాబాద్ ఫార్మా

ABN , First Publish Date - 2020-12-27T23:22:45+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి కరోనావైరస్ మెడిసిన్, టీకాలను అభివృద్ధి చేసే ఔషధ సంస్థ... ప్రపంచం దృష్టిని ఇప్పుడు మరింతగా ఆకర్షించాయి. కరోనా నేపధ్యంలో... హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు 2020 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

భారీ పెట్టుబడులు ప్రకటించిన హైదరాబాద్ ఫార్మా

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి కరోనావైరస్ మెడిసిన్, టీకాలను అభివృద్ధి చేసే ఔషధ సంస్థ... ప్రపంచం దృష్టిని ఇప్పుడు మరింతగా ఆకర్షించాయి. కరోనా నేపధ్యంలో... హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు 2020 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. భవిష్యత్తు అవసరాలకణుగుణంగా ఫార్మా కంపెనీల పెట్టుబడి ప్రణాళికలు... కరోనా చికిత్సకు ఉపయోగించే రెమ్ డెసివిర్, ఫావిపిరావిర్ వంటి మందులను తయారు చేయడమే కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా దారులు తీసాయి. 


ఫార్మా కంపెనీలు. 2020 లో మిగతా పరిశ్రమలతో పోలిస్తే భారతదేశ ఔషధ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందనే చెప్పాలి.  భారత్ బయోటెక్ దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంతోపాటు మరో రెండు వ్యాక్సిన్ ల అభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకుంది. అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వ్యాక్సిన్ అభివృద్ధి తయారీ రేసులో ముందు నిలిచాయి . రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి క్లినికల్ పరీక్షలు , తయారీకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది . హైదరాబాద్లోని కంపెనీలకు ప్రస్తుతం ఏటా 200 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. 


భారీగా పట్టుబడులు ప్రకటించిన సంస్థలు ఇవే... 

 హైదరాబాద్ లోని ఔషధ సంస్థలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో ఫార్మా కంపెనీలన్నీ భారీ పెట్టుబడుల దిశగా ప్రణాళికలు ప్రకటించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డాక్టర్ రెడ్డీస్ రూ. వెయ్యి కోట్లు, దివీస్ లేబరేటరీస్ గతంలో వెల్లడించిన పెట్టుబడుల ప్రణాళికలకు అదనంగా మరో రూ. 400  కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా పేర్కొన్నాయి. ఇదే సమయంలో గతంలో విస్తరణకు రూ. 700 కోట్లను వెచ్చించాలని భావించిన లారస్ ల్యాబ్స్ దీనిని ఏకంగా రూ. 1,200 కోట్లకు పెంచింది. 


ఔషధ ఎగుమతులు ఈ ఏడాది 2,500 కోట్ల డాలర్లకు చేరగలవని అంచనా భారత్ బయోటెక్ జీనోమ్ వ్యాలీ లో కొత్తగా వ్యాక్సిన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. అరబిందో ఫార్మా కూడా భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. 


Updated Date - 2020-12-27T23:22:45+05:30 IST