హోండా అమేజ్‌, డబ్ల్యూఆర్‌-వీ ఎక్స్‌క్లూజివ్‌ ఎడిషన్స్‌

ABN , First Publish Date - 2020-11-03T05:57:39+05:30 IST

హోండా కార్స్‌ ఇండియా.. మార్కెట్లోకి స్పెషల్‌ ఎడిషన్‌ అమేజ్‌, డబ్ల్యూఆర్‌-వీ మోడల్స్‌ను తీసుకువచ్చిం ది...

హోండా అమేజ్‌, డబ్ల్యూఆర్‌-వీ ఎక్స్‌క్లూజివ్‌ ఎడిషన్స్‌

హోండా కార్స్‌ ఇండియా.. మార్కెట్లోకి స్పెషల్‌ ఎడిషన్‌ అమేజ్‌, డబ్ల్యూఆర్‌-వీ మోడల్స్‌ను తీసుకువచ్చిం ది. డీజిల్‌, పెట్రోల్‌ వెర్షన్స్‌లో టాప్‌గ్రేడ్‌ వీఎక్స్‌తో ఎక్స్‌క్లూజివ్‌ ఎడిషన్స్‌గా వీటిని తీసుకువచ్చినట్లు తెలిపింది. మాన్యువల్‌ పెట్రోల్‌ వెర్షన్‌ అమేజ్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఎడిషన్‌ ధర రూ.7.96 లక్షలుండగా సీవీటీ వేరియంట్‌ ధర రూ.8.79 లక్షలుగా ఉంది. అమేజ్‌ డీజిల్‌ మాన్యువల్‌ వెర్షన్‌ ధర రూ.9.26 లక్షలు, సీవీటీ ధర రూ.9.99 లక్షలుగా ఉన్నాయి. ఇక పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్స్‌తో కూడిన డబ్ల్యూఆర్‌-వీ ధరలు వరుసగా రూ.9.7 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. 

Updated Date - 2020-11-03T05:57:39+05:30 IST