ఇక పెట్రోల్, సీఎన్‌జీ హోం డెలివరీ

ABN , First Publish Date - 2020-05-30T18:22:13+05:30 IST

దేశంలో లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్, సీఎన్‌జీలను ఇంటివద్దకే తీసుకువెళ్లి అందించేలా ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయని...

ఇక పెట్రోల్, సీఎన్‌జీ హోం డెలివరీ

ఆయిల్ కంపెనీల నిర్ణయం

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్, సీఎన్‌జీలను ఇంటివద్దకే తీసుకువెళ్లి అందించేలా ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇప్పటికే డీజిల్‌ను హోం డెలివరీ చేస్తున్నామని, అలాగే పెట్రోల్, సీఎన్‌జీలను కూడా ఇంటివద్దనే ప్రజలకు అందించేలా ఆయిల్ కంపెనీలు చేసిన ప్రతిపాదనకు కేంద్రం పచ్చజెండా ఊపిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో డీజిల్ ను 2018 నుంచి హోం డెలివరీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల ఇంధన డిమాండ్, వినియోగం గణనీయంగా తగ్గిందని మంత్రి చెప్పారు. రతన్ టాటా ఆధ్వర్యంలోని ఇండియన్ స్టార్టప్ కంపెనీ రిపోస్ ఎనర్జీ కంపెనీ మొబైల్ పెట్రోల్ పంపుల ద్వార ఇంటివద్దనే పెట్రోలు డెలివరీ చేస్తాయని మంత్రి వివరించారు. 

Updated Date - 2020-05-30T18:22:13+05:30 IST