టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్... భారీగా తగ్గిన హైరింగ్

ABN , First Publish Date - 2020-10-20T00:12:49+05:30 IST

భారత టాప్ 4ఐటీ కంపెనీలు 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 12,258 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. కాగా... గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 54,002 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ప్రస్తుత సమయంలో... కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగాల కోత, వేతనాల కోత వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా... మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగం కాస్త ఆశాజనకంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్-జూలై త్రైమాసికంతో పోలిస్తే ఈసారి నియామకాలు తగ్గాయి. క్యాంపస్ నియామకాలు కూడా క్షీణించాయి.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్... భారీగా తగ్గిన హైరింగ్

బెంగళూరు : భారత టాప్ 4ఐటీ కంపెనీలు 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 12,258 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. కాగా... గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 54,002 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ప్రస్తుత సమయంలో... కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగాల కోత, వేతనాల కోత వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా... మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగం కాస్త ఆశాజనకంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్-జూలై త్రైమాసికంతో పోలిస్తే ఈసారి నియామకాలు తగ్గాయి. క్యాంపస్ నియామకాలు కూడా క్షీణించాయి. 

రెండో అర్ధ సంవత్సరంలో జూమ్...

టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో కంపెనీల నియామకాలు ఏకంగా 70 శాతం నుండి 80 శాతం మేర క్షీణించాయి. టాప్ నాలుగు కంపెనీల్లో టీసీఎస్‌లో నియామకాలు మిగతా సంస్థలతో పోలిస్తే బాగా క్షీణించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో నియామకాలు తగ్గినప్పటికీ, రెండో అర్ధ సంవత్సరంలో పెరుగుతాయని భావిస్తున్నారు.


Updated Date - 2020-10-20T00:12:49+05:30 IST