హైదరాబాద్‌లో హెక్సాగాన్‌ ఏఐ కమ్యూనిటీ కేంద్రం

ABN , First Publish Date - 2020-12-29T06:17:20+05:30 IST

హెక్సాగాన్‌ ఏబీకి చెందిన హెక్సాగాన్‌ కేపబులిటీ సెంటర్‌ ఇండియా (హెచ్‌సీసీఐ) హైదరాబాద్‌లో కృత్రిమ మేధ కమ్యూనిటీ సెంటర్‌ను ప్రారంభించింది.

హైదరాబాద్‌లో హెక్సాగాన్‌ ఏఐ కమ్యూనిటీ కేంద్రం

 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెక్సాగాన్‌ ఏబీకి చెందిన హెక్సాగాన్‌ కేపబులిటీ సెంటర్‌ ఇండియా (హెచ్‌సీసీఐ) హైదరాబాద్‌లో కృత్రిమ మేధ కమ్యూనిటీ సెంటర్‌ను ప్రారంభించింది. దేశంలో హెక్సాగాన్‌ ఏర్పాటు చేసిన ‘హెక్స్‌ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌’ మొట్టమొదటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కమ్యూనిటీ సెంటర్‌. దీన్ని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. సీఎ్‌సఆర్‌ కార్యక్రమం కింద దీన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఏఐపై ఆసక్తి ఉన్న నిపుణులకు ఇందులో ఉచితంగా శిక్షణ ఇస్తారు.


 ప్రతి ఏడాది 350 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, భవిష్యత్తులో దీన్ని 600 మందికి పెంచుతామని హెచ్‌సీసీఐ జనరల్‌ మేనేజర్‌ నవనీత్‌ మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా పంపిన సందేశంలో ఏఐ, ఇతర డిజిటల్‌ టెక్నాలజీల్లో ప్రపంచ అగ్రగామిగా ఉండేందుకు తెలంగాణ స్పష్టమైన దృక్పథంతో ఉన్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. 


Updated Date - 2020-12-29T06:17:20+05:30 IST