సెల్‌కాన్ నుంచి ఆరోగ్య ఉత్పత్తులు
ABN , First Publish Date - 2020-05-13T06:50:47+05:30 IST
దేశీయ మొబైల్ బ్రాండ్ సెల్‌కాన్.. తాజాగా ఆరోగ్య ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగే అన్ని రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు సెల్‌కాన్ చైర్మన్...

హైదరాబాద్: దేశీయ మొబైల్ బ్రాండ్ సెల్‌కాన్.. తాజాగా ఆరోగ్య ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగే అన్ని రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు సెల్‌కాన్ చైర్మన్, ఎండీ వై గురు తెలిపారు. హైదరాబాద్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయనున్న ఈ ఉత్పత్తులను భారత్‌తో పాటు ఇతర దేశాల్లో విక్రయించనున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ హెల్త్ ప్రొడక్ట్‌ల జాబితాలో ఆటోమెటిక్ హ్యాండ్ శానిటైజర్, ఆటోమెటిక్ స్ర్పే శానిటైజర్, ఎలకో్ట్రస్టాటిక్ స్ర్పే గన్, యూవీసీ స్టెరిలైజర్, యూవీసీ డిస్‌ఇన్‌ఫెక్షన్ ప్యాక్, ఫేస్ రికగ్నిషన్ థర్మామీటర్, ఫేస్ రీడర్ అటెండెన్స్ మెషీన్, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్, ఫేస్ షీల్డ్ మాస్క్, నెక్ మసాజర్, పీపీఈ కిట్లు ఉన్నాయి.