భారీగా పెరిగిన ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు...

ABN , First Publish Date - 2020-12-12T01:56:40+05:30 IST

మారుతున్న జీవనశైలితో వస్తున్న జబ్బులు, మరోవైపు ఇప్పటికే ఉన్న సీజనల్ వ్యాధులు దాడి చేస్తోన్న తరుణంలో అనారోగ్యం భారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటికి తోడు కరోనా మహమ్మారి... ఆరోగ్య బీమా పాలసీ వైపు చూసేలా చేస్తోంది. కరోనా చికిత్సకు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే... ఆరోగ్య భీమా పాలసీలను తీసుకోవడం ఉత్తమం.

భారీగా పెరిగిన ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు...

న్యూఢిల్లీ : మారుతున్న జీవనశైలితో వస్తున్న జబ్బులు, మరోవైపు ఇప్పటికే ఉన్న సీజనల్ వ్యాధులు దాడి చేస్తోన్న తరుణంలో అనారోగ్యం భారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటికి తోడు కరోనా మహమ్మారి... ఆరోగ్య బీమా పాలసీ వైపు చూసేలా చేస్తోంది. కరోనా చికిత్సకు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే... ఆరోగ్య భీమా పాలసీలను తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే... కరోనా నేపధ్యంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతోపాటు పలు ఆస్పత్రులు బీమా పాలసీలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటోన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 


కాగా... బీమా కంపెనీల విజ్ఞప్తులకణుగుణంగా ఈ నెల 3 న, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య బీమా ప్రీమియంలను 5 శాతం మేర పెంచుకోవానికి అనుమతినిచ్చింది. కానీ తమ ఆరోగ్య బీమా ప్రీమియం లో 30-35 శాతం మేర పెరిగినట్లు పలువురు వినియోగదారుల నుంచి ఐఆర్‌డీఏఐ కు పలు ఫిర్యాదులందుతున్నాయి. 


ఐఆర్‌డీఏఐ ఏం చెబుతోందంటే... 

వాస్తవానికి బేస్ ప్రీమియాన్ని 5 శాతం మేర పెంచుకోవడానికి మాత్రమే స్వతంత్ర బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అనుమతించింది. ఐఆర్‌డీఏఐ నిర్దేశించిన మార్గదర్శకాలకు అణుగుణంగానే ఆయా బీమా సంస్థలు ప్రీమియం రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఉంది. బీమా సంస్థలు ప్రీమియం రేట్లు పెంచడానికి హేతుబద్ధత కలిగి ఉండాలని ఐఆర్‌డీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో...  ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఫిర్యాదులందే సందర్భాల్లో... బీమా ధర పెరుగుదలకు కారణాలను ఐఆర్‌డీఏఐకి అందించాల్సి ఉంటుంది.


ప్రీమియం రేట్ల పెంపు వెనుక...

ఆరోగ్య బీమా కంపెనీలు వారి క్లెయిమ్ అనుభవం, పూచీకత్తు సూత్రం ఆధారంగా ప్రీమియం రేట్లను పెంచుకోవడానికి అనుమతించబడతాయని బీమా అధికారులు చెబుతున్నారు. ‘ఇది మాకు కఠినమైన సంవత్సరం. ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కారణంగా క్లెయింలు విపరీతంగా పెరుగుతున్నాయి. కోవిడ్ 19 తో వైద్య ద్రవ్యోల్బణం 19.5 శాతానికి చేరుకుంది. కస్టమర్ల కోసం ధరలను పెంచడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని చెబుతున్నారు.

Updated Date - 2020-12-12T01:56:40+05:30 IST