రుణ గ్రహీతలకు హెచ్‌డీఎఫ్‌సీ తీపికబురు...

ABN , First Publish Date - 2020-11-11T02:23:42+05:30 IST

పండుగ సీజన్‌లో కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ వెసులుబాటు కల్పించనుంది. రుణ రేట్లు తగ్గించింది. బ్యాంకు నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.

రుణ గ్రహీతలకు హెచ్‌డీఎఫ్‌సీ తీపికబురు...

ముంబై : పండుగ సీజన్‌లో కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ వెసులుబాటు కల్పించనుంది. రుణ రేట్లు తగ్గించింది. బ్యాంకు నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. 


హోం లోన్స్‌కు సంబంధించి రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు లో 10 బేసిస్ పాయింట్ల కోత విధించింది. నవంబర్ 10 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఈ రోజు(మంగళవారం) నుంచే తగ్గింపు వడ్డీ రేట్లు అమల్లోకొచ్చాయి. రేట్ల కోత నిర్ణయంతో హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్ హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు  ప్రయోజనం కలుగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్ ప్రకారం... హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. 


ఇకపోతే ఇటీవలే ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రుణ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.85 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇక కెనరా బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటులో ఇటీవల 0.15 శాతం తగ్గించింది. 


మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇటీవల హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లలో కోత విధించిన విషయం తెలిసిందే. రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను 0.1 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటిచింది. కాగా... మహిళలకు హోమ్ లోన్స్‌పై అదనంగా 0.05 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొంది. దీంతో మహిళలు 0.15 శాతం తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు.

Updated Date - 2020-11-11T02:23:42+05:30 IST