హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.6,659 కోట్లు

ABN , First Publish Date - 2020-07-19T06:08:29+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 20 శాతం వృద్ధి చెంది రూ.6,658.62 కోట్లుగా నమోదైంది...

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.6,659 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 20 శాతం వృద్ధి చెంది రూ.6,658.62 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయం మెరుగ్గా ఉండటంతో పాటు అడ్వాన్సుల్లో వృద్ధితో మంచి పనితీరును కనబరిచినట్లు  వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.5,568.16 కోట్లుగా ఉంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.32,361.84 కోట్ల నుంచి రూ.34,453.28 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం 17.8 శాతం వృద్ధి చెంది రూ.15,665.4 కోట్లకు చేరుకోగా అడ్వాన్సుల్లో 20.9 శాతం, డిపాజిట్లలో 24.6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది.


Updated Date - 2020-07-19T06:08:29+05:30 IST