హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ వేతనం రూ.18.92 కోట్లు

ABN , First Publish Date - 2020-07-20T06:42:28+05:30 IST

ప్రైవేట్‌ రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పురి వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. భత్యాలతో కలిపి 2019-20లో ఆయన అందుకుంది అక్షరాలా రూ.18.92 కోట్లు...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ వేతనం రూ.18.92 కోట్లు

ముంబై: ప్రైవేట్‌ రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పురి వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. భత్యాలతో కలిపి 2019-20లో ఆయన అందుకుంది అక్షరాలా రూ.18.92 కోట్లు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ.భారత బ్యాకింగ్‌ చరిత్రలో మరే బ్యాంక్‌ ఎండీ ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో జీతం అందుకోవడం లేదు. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈక్విటీలో 26 శాతం వాటా ఉన్న ఆ బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ వార్షిక  వేతనం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,97 కోట్లు మాత్రమే. ఆదిత్య పురి 2019-20లో రూ.18.92 కోట్ల జీతంతో పాటు స్టాక్‌ ఆప్షన్‌ కింద వచ్చిన కొన్నిషేర్లు విక్రయించటం ద్వారా మరో రూ.161.556 కోట్లు సంపాదించారు. 

Updated Date - 2020-07-20T06:42:28+05:30 IST