ఆపిల్ బ్లూ టిక్ ను ఫేస్‌బుక్ తొలగించిందా ?

ABN , First Publish Date - 2020-12-25T23:03:53+05:30 IST

ఆపిల్ తన ఐ ఫోన్ మొబైల్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్స్, నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుండి ఫేస్‌బుక్ వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ... ఆపిల్ తన కొత్త విధానాలతో చిన్న వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది. ఈ నిబంధనల విషయంలో మాత్రం ఆపిల్ తనను తాను సమర్థించుకుంది.

ఆపిల్ బ్లూ టిక్ ను  ఫేస్‌బుక్ తొలగించిందా ?

న్యూఢిల్లీ : ఆపిల్ తన ఐ ఫోన్ మొబైల్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్స్, నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుండి ఫేస్‌బుక్ వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ... ఆపిల్ తన కొత్త విధానాలతో చిన్న వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది. ఈ నిబంధనల విషయంలో మాత్రం ఆపిల్ తనను తాను సమర్థించుకుంది. ఈ వివాదం మధ్య ఫేస్‌బుక్ తన ప్లాట్ ఫామ్ లో ఆపిల్ అధికారిక పేజీని తొలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవరా... ఆపిల్ అధికారిక పేజీని ఫేస్‌బుక్ గుర్తించలేదని మొదట కనుగొన్నాడు.


మాట్ నవరా ఆపిల్ ఫేస్‌బుక్ పేజీ స్క్రీన్‌షాట్ ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంటూ ‘ఫేస్‌బుక్ ఆపిల్ బ్లూ టిక్ ని తొలగించింది’ అని పోస్ట్ చేసాడు. అయితే, ఫేస్‌బుక్‌ బృదంతో తనిఖీ చేసుకున్న తర్వాత నవరా వెంటనే మరో కొత్త పోస్టును పోస్ట్ చేసాడు. ఆ పోస్టులో అధికారిక ఆపిల్ పేజీని ఫేస్‌బుక్ ఎప్పుడూ ధృవీకరించలేదని ఆయన రాశారు. 


Updated Date - 2020-12-25T23:03:53+05:30 IST