‘హీరో’తో ‘హార్లే’ దోస్తీ!

ABN , First Publish Date - 2020-10-28T08:05:43+05:30 IST

భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన హార్లే డేవిడ్‌సన్‌.. తన వ్యూహం మార్చుకుం ది. పునరాగమనం కోసం హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టింది...

‘హీరో’తో ‘హార్లే’ దోస్తీ!

న్యూఢిల్లీ: భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన హార్లే డేవిడ్‌సన్‌.. తన వ్యూహం మార్చుకుం ది. పునరాగమనం కోసం హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా.. హీరో మోటోకార్ప్‌ ప్రీమియం మోటార్‌సైకిళ్లను హార్లే డేవిడ్‌సన్‌ పేరుతో అభివృద్ధి చేయడంతోపాటు దేశీయ మార్కెట్లో విక్రయించనుంది. ఇకపై హార్లే బైక్‌ల సర్వీసింగ్‌తోపాటు విడిభాగాలను సమకూర్చే బాధ్యత కూడా హీరో మోటోకార్ప్‌దే. అంతేకాదు, హార్లే యాక్సెసరీస్‌, రైడింగ్‌ గేర్‌, ప్రత్యేక దుస్తుల విక్రయ హక్కులు సైతం హీరోవే. హార్లే డేవిడ్‌సన్‌ బ్రాండ్‌ పేరిట ప్రత్యేక డీలర్‌షి్‌పలతోపాటు ప్రస్తుత సేల్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా హీరో వీటిని విక్రయించనుంది. మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు ఈ విషయాల్ని వెల్లడించాయి. 

Updated Date - 2020-10-28T08:05:43+05:30 IST