భూమి అమ్మకాలపై జీఎస్‌టీ తప్పదు
ABN , First Publish Date - 2020-06-22T05:40:39+05:30 IST
డ్రైనేజీ వసతులు, నీటి పారుదల లైన్లు, విద్యుత్ లైన్లు వంటి సదుపాయాలతో డెవలప్ చేసిన ప్లాట్ల విక్రయాలపై జీఎ్‌సటీ తప్పదని జీఎ్‌సటీకి చెందిన అధారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలిం గ్ (ఏఏఆర్) తేల్చి చెప్పింది...

- తేల్చి చెప్పిన ఏఏఆర్
న్యూఢిల్లీ: డ్రైనేజీ వసతులు, నీటి పారుదల లైన్లు, విద్యుత్ లైన్లు వంటి సదుపాయాలతో డెవలప్ చేసిన ప్లాట్ల విక్రయాలపై జీఎ్‌సటీ తప్పదని జీఎ్‌సటీకి చెందిన అధారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలిం గ్ (ఏఏఆర్) తేల్చి చెప్పింది. అలా డెవలప్ చేసిన ప్లాట్లు కొనుగోలుదార్లకు విక్రయించేందుకు నిర్మించిన కాంప్లెక్స్‌ల నిర్వచనంలోకి వస్తాయని, ఆ రకంగా అవి ‘నిర్మాణ సేవల’ వర్గీకరణలోకి వస్తాయి గనుక వాటి విక్రయాలపైౖ జీఎస్‌టీ తప్పదని ఆ తీర్పులో ఏఏఆర్ స్పష్టం చేసింది.
జిల్లా పంచాయతీ అనుమతి మేరకే నీటిపారుదల, డ్రైనేజీ, విద్యుత్ ప్రాథమిక వసతులు కల్పించి చదును చేసిన భూముల విక్రయంపై జీఎస్‌టీ విధించవచ్చా అని ప్రశ్నిస్తూ గుజరాత్ బెంచ్‌లో వేసిన పిటిషన్‌కు స్పందించిన సంబంధిత ఏఏఆర్ ఈ తీర్పు ఇచ్చింది. డెవలప్ చేసిన భూములేవైనా విక్రయించే సమయంలో భూమి వ్యయంతో పాటు వాటిలోని సదుపాయాలకు అయిన వ్యయాలను కూడా తగు నిష్పత్తిలో కలిపి విక్రయిస్తారన్న విషయం ఆ బెంచ్ గుర్తు చేసింది.
అద్దె వాహనాలపై ఐటీసీ సాధ్యం కాదు
ఉద్యోగుల తరలింపు నిమిత్తం అద్దెకు తీసుకునే వాహనాలపై సంబంధిత కంపెనీలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేయడం సాధ్యం కాదని హిమాచల్‌ప్రదేశ్ ఏఏఆర్ తీర్పు చెప్పింది. ప్రసారభారతి బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఆల్ ఇండియా రేడియో) సిమ్లా విభాగం దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని ఆ రాష్ట్ర బెంచ్ ఈ తీర్పు ప్రకటించింది.