ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లు
ABN , First Publish Date - 2020-03-02T07:28:30+05:30 IST
ప్రతి లావాదేవీకి వినియోగదారులు బిల్లు తీసుకునేలా ప్రోత్సహించేందుకై.. వచ్చే నెల నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) లాటరీని ప్రభుత్వం మొదలుపెట్టనుంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య...

జనవరితో పోల్చితే తగ్గుదల
న్యూఢిల్లీ : ఫిబ్రవరి నెలలో వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఈ వసూళ్లు 8 శాతం వృద్ధి చెందగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి నెలతో చూస్తే మాత్రం తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరి నెలలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో జీఎ్‌సటీ వసూళ్లు మొత్తం రూ.1,05,366 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో సీజీఎ్‌సటీ రూ.20,569 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ రూ.27,348 కోట్లు, ఐజీఎ్‌సటీ రూ.48,503 కోట్లుగా ఉండగా సెస్ రూ.8,947 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.
ఫిబ్రవరి 29 వరకు జనవరి నెలకు సంబంధించిన జీఎ్‌సటీఆర్-3బీ రిటర్నులు 83 లక్షలుగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరిలోనూ ఈ రిటర్నులు ఇంతే స్థాయిలో ఉన్నాయి. రెగ్యులర్ సెటిల్మెంట్లో భాగంగా ఐజీఎ్‌సటీ నుంచి సీజీఎ్‌సటీకి రూ.22,586 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీకి రూ.16,553 కోట్లు చెల్లించినట్లు చేసినట్లు తెలిపింది. ఫిబ్రవరి నెల రెగ్యులర్ సెటిల్మెంట్ అనంతరం కేంద్ర ప్రభుత్వం సీజీఎ్‌సటీ రూపంలో రూ.43,155 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.రూ.43,901 కోట్లు ఆర్జించాయని మంత్రిత్వ శాఖ పేర్కొం ది. గత నెలలో దేశీయ లావాదేవీల నుంచి జీఎ్‌సటీ రెవెన్యూలు 12 శాతం పెరిగాయని తెలిపింది. కాగా ఈ నెలలో దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై జీఎ్‌సటీ.. ప్రతికూల వృద్ధి మైనస్ 2 శాతం నమోదైందని పేర్కొంది.
జీఎస్టీ బిల్లులపై బంపరాఫర్!.. ఏప్రిల్ 1 నుంచి నెలవారీ లాటరీ
ప్రతి లావాదేవీకి వినియోగదారులు బిల్లు తీసుకునేలా ప్రోత్సహించేందుకై.. వచ్చే నెల నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) లాటరీని ప్రభుత్వం మొదలుపెట్టనుంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య జరిగిన లావాదేవీల (బీ2సీ) ఇన్వాయిస్లపై ఈ లాటరీని నిర్వహించనుంది. వ్యాపారులు జీఎస్టీ ఎగవేయకుండా ఉండాలంటే వినియోగదారులు బిల్లు తీసుకోవాలని.. అది తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమమని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెలలో జీఎస్టీ ఇన్వాయి్సలపై లక్కీ డ్రా తీసి భారీ బంపర్ బహుమతిని, రాష్ట్రాల వారీగా రెండవ, మూడవ బహుమతుల్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. బహుమతులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి మధ్యలో ఉంటాయని వెల్లడించారు.
దీనికి వినియోగదారులు చేయాల్సిందల్లా.. తమ బీ2సీ ఇన్వాయి్సను స్కాన్ చేసి జీఎ్‌సటీఎన్ యాప్‌లో అప్లోడ్ చేయడమే. ప్రస్తుతం తయారీ దశలో ఉన్న యాప్, ఈ నెలాఖరుకల్లా ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులోకి రానుంది. బిల్లుకు కనీస లావాదేవీ అంటూ లేదని.. ఎంత చిన్నమొత్తమైనా లాటరీకి యత్నించుకోవచ్చని అధికారులు తెలిపారు.