ఎన్‌ఈసీ ఎనర్జీ కొనుగోలు బరిలో గ్రీన్‌కో

ABN , First Publish Date - 2020-09-25T06:07:21+05:30 IST

జపాన్‌ కంపెనీ ఎన్‌ఈసీ కార్ప్‌కు చెందిన ఎన్‌ఈసీ ఎనర్జీ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌ పోటీపడుతోంది...

ఎన్‌ఈసీ ఎనర్జీ కొనుగోలు బరిలో గ్రీన్‌కో

న్యూఢిల్లీ: జపాన్‌ కంపెనీ ఎన్‌ఈసీ కార్ప్‌కు చెందిన ఎన్‌ఈసీ ఎనర్జీ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌ పోటీపడుతోంది. గ్రీన్‌కోతోపాటు అమెరికాకు చెందిన ఏఈఎస్‌ కార్పొరేషన్‌ కూడా ఈ పోటీలో ముందువరుసలో ఉంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ 30 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,250 కోట్లు) స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ అమెరికాలోని మసాచుసెట్స్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మెగావాట్‌ సామర్థ్యంతో కూడిన లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీకి సంబంధించి ఎన్‌ఈసీ మేధోసంపత్తి హక్కులు(ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌) కలిగి ఉంది.  స్టోరేజీ బ్యాటరీల వ్యాపారంపైనా దృష్టిసారించేందుకు గ్రీన్‌కో.. ఈ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-09-25T06:07:21+05:30 IST