మనవడొచ్చాడు..!
ABN , First Publish Date - 2020-12-11T08:03:18+05:30 IST
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యారు.
తాత అయిన ముకేశ్ అంబానీ
ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యారు. ఆకాశ్ భార్య శ్లోకా మెహతా గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. తద్వారా ముకేశ్-నీతా అంబానీ దంపతులు తొలిసారిగా తాత, నానమ్మలయ్యారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా, మోనా మెహతా దంపతుల కుమార్తె శ్లోకాతో ఆకాశ్ అంబానీ వివాహం 2019 మార్చి 9న జరిగిన సంగతి తెలిసిందే.