చెక్‌ బౌన్స్‌ ఇక నేరం కాదు?

ABN , First Publish Date - 2020-06-11T08:00:57+05:30 IST

చెక్‌ బౌన్స్‌ కేసులు, బ్యాంకు రుణాల చెల్లింపు కేసులు, చిట్‌ఫండ్‌ చట్టం వంటి 19 చట్టాల కింద చిన్న చిన్న తప్పులను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది...

చెక్‌ బౌన్స్‌ ఇక నేరం కాదు?

న్యూఢిల్లీ : చెక్‌ బౌన్స్‌ కేసులు, బ్యాంకు రుణాల చెల్లింపు కేసులు, చిట్‌ఫండ్‌ చట్టం వంటి 19 చట్టాల కింద చిన్న చిన్న తప్పులను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.   సులభతర వ్యాపార విధానాలు మరింత సరళం చేయాలన్న ఆలోచన ఇందుకు కారణం. ఆ ప్రయత్నంలో భాగంగానే సాంకేతిక కారణాలతో చేసే చిన్న చిన్న తప్పులను తీవ్ర నేరాల జాబితా నుంచి తప్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన. దీనిపై ఈ నెల 23లోగా తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పౌర సంఘాలు, విద్యావేత్తలు, తదితరులను కోరింది. 


Updated Date - 2020-06-11T08:00:57+05:30 IST