చిన్న వ్యాపారాలకు చేయూత!

ABN , First Publish Date - 2020-04-28T05:40:08+05:30 IST

లాక్‌డౌన్‌తో చితికిపోయిన చిన్న పరిశ్రమలు, వ్యాపారాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు సమాచారం. వీటికి రూ.3 లక్షల కోట్ల రుణాలందించే యోచనలో ఉందని...

చిన్న వ్యాపారాలకు చేయూత!

  • ప్రభుత్వ హామీతో రూ.3 లక్షల కోట్ల రుణాలు 


న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో చితికిపోయిన చిన్న పరిశ్రమలు, వ్యాపారాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు సమాచారం. వీటికి రూ.3 లక్షల కోట్ల రుణాలందించే యోచనలో ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ రుణాలకు ప్రభుత్వమే హామీదారుగా ఉండనుందన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక చిన్న వ్యాపారాలు మళ్లీ గాడిన పడేందుకు ఈ రుణాలు తోడ్పడతాయని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం.. చిన్న వ్యాపారాలు ఇప్పటికే తీసుకున్న రుణంలో 20 శాతాన్ని అదనపు రుణంగా పొందేందుకు వీలుంటుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ రుణాల డిఫాల్ట్‌లకు చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు  ఆ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2020-04-28T05:40:08+05:30 IST