త్వరలో గూగుల్‌ డెబిట్‌ కార్డ్‌!

ABN , First Publish Date - 2020-04-21T08:08:33+05:30 IST

ఇంటర్నెట్‌తోపాటు ఆర్థిక సేవల్లోనూ దూసుకెళ్తోన్న గూగుల్‌.. త్వరలో స్మార్ట్‌ డెబిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది

త్వరలో గూగుల్‌ డెబిట్‌ కార్డ్‌!

ఇంటర్నెట్‌తోపాటు ఆర్థిక సేవల్లోనూ దూసుకెళ్తోన్న గూగుల్‌.. త్వరలో స్మార్ట్‌ డెబిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ‘గూగుల్‌ పే’ పేరుతో మొబైల్‌ వ్యాలెట్‌ సేవలందిస్తోన్న సంస్థ.. దీనికి అనుసంధానంగా డెబిట్‌ కార్డును కూడా ప్రవేశపెట్టాలనుకుంటోంది. దీనికి గూగుల్‌ కార్డ్‌గా నామకరణం చేయనున్నట్లు సమాచారం.


ఈ కార్డు ఫిజికల్‌గానే కాకుండా వర్చువల్‌గానూ అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఫిజికల్‌ కార్డుతో రిటైల్‌ విక్రయ కేంద్రాల వద్ద చెల్లింపులు జరపవచ్చు. కాంటాక్ట్‌లెస్‌ (ఎన్‌ఎ్‌ఫసీ) పేమెంట్‌ ఆప్షన్‌ కూడా కల్పించే అవకాశాలున్నట్లు సమాచారం.  

Updated Date - 2020-04-21T08:08:33+05:30 IST