మళ్లీ భగ్గుమన్న బంగారం ధర

ABN , First Publish Date - 2020-05-30T00:29:12+05:30 IST

బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. హాంకాంగ్ విషయంలో చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలకు తోడు కరోనా వైరస్

మళ్లీ భగ్గుమన్న బంగారం ధర

న్యూఢిల్లీ: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. హాంకాంగ్ విషయంలో చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలకు తోడు కరోనా వైరస్ కేసుల పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు తిరిగి బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపారు. దీంతో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల ప్రభావం భారత మార్కెట్లపైనా కనిపించింది. ఎంసీఎక్స్‌లో నేడు (శుక్రవారం) 10 గ్రాముల బంగారం ధర రూ. 209 పెరిగి రూ. 46,614కు పెరిగింది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. కిలోకు రూ. 167 పెరిగి రూ. 48,725కు చేరుకుంది. 

Updated Date - 2020-05-30T00:29:12+05:30 IST