భారత్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు

ABN , First Publish Date - 2020-08-21T01:12:03+05:30 IST

భారత్‌ గత రెండు రోజుల్లో బంగారం ధరలు పది గ్రాములకు రూ. 1,850 మేర తగ్గాయి...

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: భారత్‌ గత రెండు రోజుల్లో బంగారం ధరలు పది గ్రాములకు రూ. 1,850 మేర తగ్గాయి. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ సైతం ఇవాళ రూ.900 తగ్గి రూ.51,721కి చేరింది. గత నెల 22న తొలిసారి రూ.50 వేల స్థాయిని దాటిన బంగారం ధరలు.. ఈ నెల మొదట్లో దాదాపు రూ. 56,200 ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకాయి. మొత్తంగా ఈ ఏడాది పసిడి మెరుపులు 32 శాతం మేర ఎగబాకాయి.

Updated Date - 2020-08-21T01:12:03+05:30 IST