పసిడి పైపైకి..
ABN , First Publish Date - 2020-03-25T06:42:29+05:30 IST
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మంగళవారం నాడు ఔన్స్ (31.10 గ్రాము లు) పసిడి ధర ఒక దశలో 100 డాలర్లకు పైగా పెరిగి 1,675 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి 14.13 డాలర్లు...

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మంగళవారం నాడు ఔన్స్ (31.10 గ్రాము లు) పసిడి ధర ఒక దశలో 100 డాలర్లకు పైగా పెరిగి 1,675 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి 14.13 డాలర్లు పలికింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సోమవారం భారీ చర్యలు ప్రకటించింది. ఫెడ్ ప్రకటనల దన్నుతో బంగారం ధరలు మళ్లీ ర్యాలీ కనబరిచాయి. భారత మార్కెట్ విషయానికొస్తే.. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు నగరాల్లోని బులియన్ మార్కెట్లో స్పాట్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముంబై స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలను ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) నిర్ణయిస్తుంటుంది. ఐబీజేఏ ప్రకారం..మంగళవారానికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ముగింపు ధరను రూ.42,247గా నిర్ణయించింది. వెండి ధర కూడా రూ.40,325గా నమోదైంది.