పసిడి కాస్త దిగొచ్చే..

ABN , First Publish Date - 2020-08-12T06:29:12+05:30 IST

కొండెక్కిన బంగారం, వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర మంగళవారం నాడు రూ.1,317 తగ్గి రూ.54,763గా నమోదైంది...

పసిడి కాస్త దిగొచ్చే..

  • ఢిల్లీ మార్కెట్లో రూ.1,317 తగ్గుదల 
  • 10 గ్రాముల ధర రూ.54,763
  • ఒక్కరోజే రూ.2,943 జారిన వెండి 
  • రూ.73,600కి కేజీ ధర  

న్యూఢిల్లీ: కొండెక్కిన బంగారం, వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర మంగళవారం నాడు రూ.1,317 తగ్గి రూ.54,763గా నమోదైంది. కిలో వెండి రేటు ఒక్క రోజే రూ.2,943 దిగజారి రూ.73,600కు పలికింది. ముంబై మార్కెట్లో మేలి మి బంగారం రూ.1,564 తగ్గి రూ.53,951కి చేరగా.. కేజీ సిల్వర్‌ రూ.2,397 తగ్గి రూ.71,211 వద్ద క్లోజైంది. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగా రం రూ.58,030 ధర పలికింది. 22 క్యారెట్ల రేటు రూ.53,140గా, కిలో వెండి రూ.72,500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు రూపాయి మారకం రేటు బలపడటం ఇందుకు దోహదపడిందని బులియన్‌ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-08-12T06:29:12+05:30 IST