వరుసగా మూడో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు

ABN , First Publish Date - 2020-11-06T22:22:09+05:30 IST

బంగారం ధరలు ఇవాళ వరుసగా మూడోరోజుల భారీగా పెరిగాయి. శుక్రవారం పది గ్రాముల పసిడి...

వరుసగా మూడో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఇవాళ వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. శుక్రవారం పది గ్రాముల పసిడి ధర రూ.791 పెరిగి రూ.51,717 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జోరందుకోవడంతో దేశీయ మార్కెట్లపైనా దాని ప్రభావం పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ వెల్లడించింది. ఇంతకు ముందు ట్రేడింగ్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ. 50,926 వద్ద ముగిసింది. కాగా బంగారంతో పాటు వెండి కూడా ఇవాళ అంతే స్థాయిలో పుంజుకుంది. కిలో వెండి ధర రూ.2,147 పెరిగి 64,578కి చేరింది. గత ట్రేడింగ్‌లో ఇది రూ. 62,431 వద్ద క్లోజ్ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో  ఔన్సు బంగారం ధర 1,950 డాలర్లుగా ఉండగా.. వెండి ధర ఔన్సుకు 25.44 వద్ద కొనసాగుతోంది.  

Updated Date - 2020-11-06T22:22:09+05:30 IST