రూ. 46 వేల మార్క్‌కు చేరుకున్న బంగారం ధర
ABN , First Publish Date - 2020-04-22T00:56:53+05:30 IST
దేశీయ బంగారం ఫ్యూచర్స్‌లో నేడు పసిడి ధర 10 గ్రాములకు రూ. 46 వేలుగా నమోదైంది. ఎంసీఎక్స్ గోల్డ్

న్యూఢిల్లీ: దేశీయ బంగారం ఫ్యూచర్స్‌లో నేడు పసిడి ధర 10 గ్రాములకు రూ. 46 వేలుగా నమోదైంది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో పది గ్రాములకు రూ. 336 పెరిగి 10 గ్రాములకు రూ.46,050ను తాకింది. సెషన్ తొలి అర్ధభాగంలో 10 గ్రాములకు రూ. 45,714 గా ఉంది. ఉదయం 11:10 గంటల సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (జూన్ 5న డెలివరీ) 10 గ్రాములకు రూ. 283 పెరిగింది. ముంబైకి చెందిన ఇండస్ట్రీ బాడీ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం.. బంగారు ఆభరణాల ప్రారంభ రేటు 10 గ్రాములకు రూ.46,074, వెండి కిలోకు రూ. 42,710గా ఉంది. అయితే, ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వంటి కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారు ఆభరణాల ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, బలమైన డాలర్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి.