‘ప్రైవేట్‌ రైలు’పై జీఎంఆర్‌ ఆసక్తి

ABN , First Publish Date - 2020-07-22T06:08:55+05:30 IST

విమానాశ్రయాల నిర్వహణలో ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌.. ప్రైవేట్‌ రైళ్లు నడిపేందుకూ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ‘ప్రైవేట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌’కు సంబంధించి మంగళవారం ప్రీ-అప్లికేషన్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది...

‘ప్రైవేట్‌  రైలు’పై జీఎంఆర్‌ ఆసక్తి

  • హైదరాబాద్‌కు చెందిన మేధ గ్రూప్‌ సైతం.. 


న్యూఢిల్లీ: విమానాశ్రయాల నిర్వహణలో ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌.. ప్రైవేట్‌ రైళ్లు నడిపేందుకూ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ‘ప్రైవేట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌’కు సంబంధించి మంగళవారం ప్రీ-అప్లికేషన్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. జీఎంఆర్‌ గ్రూప్‌, హైదరాబాద్‌కు చెందిన మేధ గ్రూప్‌ సహా మొత్తం 16 కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో బొంబార్డియర్‌ ఇండియా, సీఏఎఫ్‌, ఐఆర్‌సీటీసీ, రైట్స్‌, బీహెచ్‌ఈఎల్‌, ఆర్‌కే అసోసియేట్స్‌, స్టెరిలైట్‌ పవర్‌, భారత్‌ ఫోర్జ్‌, జేకేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కూడా ఉన్నాయని తెలిసింది. రైల్వే శాఖ తొలిసారిగా 109 మార్గాల్లో అప్‌ అండ్‌ డౌన్‌ ప్యాసింజర్‌ ట్రైన్‌ సర్వీసులు నడిపేందుకు ప్రైవేట్‌ కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించబోతోంది.

Updated Date - 2020-07-22T06:08:55+05:30 IST