మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి
ABN , First Publish Date - 2020-03-14T07:05:00+05:30 IST
భారత్‌లో విమాన ప్రయాణికులు వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని.. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడమే ముఖ్యమని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్‌లో విమాన ప్రయాణికులు వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని.. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడమే ముఖ్యమని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ఎస్‌జీకే కిషోర్ అన్నారు. గత పదేళ్లలో విమాన మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని.. అయితే ఇంకా పెరగాల్సి ఉందని చెప్పారు. దేశంలో ప్రతి వెయ్యి మందికి ఐదుగురు మాత్రమే ప్రయాణం చేస్తున్నారని వివరించారు. భారత్‌లో రీజినల్ జెట్లకు మంచి అవకాశాలు ఉన్నాయని ఎంబ్రాయర్ వైస్ ప్రెసిడెంట్ సీసర్ పెరిరియా తెలిపారు. అంతర్జాతీయ సేవలపై భారత విమానయాన కంపెనీలు దృష్టి పెట్టాలని విస్తారా సీఈఓ లెస్లీ థంగ్ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇతర దేశాలతో భారత్‌ను పోల్చడానికి వీలు లేదని.. అయితే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని వివరించారు.