జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు రూ.4,565 కోట్లు

ABN , First Publish Date - 2020-07-08T06:05:59+05:30 IST

జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి ఫ్రాన్స్‌కు చెందిన గ్రూపే ఏడీపీ నుంచి మరో రూ.4,565 కోట్ల నిధులు అందాయి. గ్రూపే ఏడీపీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్...

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు రూ.4,565 కోట్లు

  • చెల్లించిన ఫ్రెంచ్‌ కంపెనీ


న్యూఢిల్లీ: జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి ఫ్రాన్స్‌కు చెందిన గ్రూపే ఏడీపీ నుంచి మరో రూ.4,565 కోట్ల నిధులు అందాయి.  గ్రూపే ఏడీపీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ ఈక్విటీలో 49 శాతం వాటాను రూ.10,780 కోట్లకు కొనుగోలు చేసింది. అందులో రూ.5,248 కోట్ల మొత్తాన్ని అప్పుడే చెల్లించింది. తాజాగా గ్రూపే మరో రూ.4,565 కోట్లు చెల్లించిందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది.


కంపెనీ పనితీరు ఆధారంగా  2024 మార్చిలోపు మరో రూ.1,060 కోట్లు గ్రూపే ఏడీపీ నుంచి అందుతాయని పేర్కొంది. ఈ నిధులను రుణ భారం తగ్గించుకునేందుకు, ఇతర వ్యాపార అవసరాలకు ఖర్చు చేయాలని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా భావిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ ఈక్విటీలో గ్రూపె ఏడీపీ అతి పెద్ద ఈక్విటీ వాటాదారవుతుంది. అయినా కంపెనీ నిర్వహణ పూర్తిగా జీఎంఆర్‌ గ్రూప్‌ చేతిలోనే ఉంటుంది. 


Updated Date - 2020-07-08T06:05:59+05:30 IST