రిలయన్స్‌ రిటైల్‌లో జీఐసీ పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-10-03T07:07:39+05:30 IST

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లోకి మరిన్ని పెట్టుబడు లు వచ్చాయి...

రిలయన్స్‌ రిటైల్‌లో జీఐసీ పెట్టుబడులు

రూ.5,512 కోట్లకు 1.22 శాతం వాటా కొనుగోలు 


ముంబై: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లోకి మరిన్ని పెట్టుబడు లు వచ్చాయి. అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గజం జీఐసీ కూడా ఈ కంపెనీలో 1.22 శాతం వాటాను రూ.5,512.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ విలువను రూ.4.285 లక్షల కోట్లు గా లెక్కగట్టారు. రిలయన్స్‌ రిటైల్‌లోకి వచ్చిన ఐదో పెట్టుబడి ఇది. తొలుత సిల్వర్‌ లేక్‌ ఆ తర్వాత కేకేఆర్‌, జనరల్‌ అట్లాంటిక్‌, ముబదాల కూడా పెట్టుబడులు పెట్టాయి.

Updated Date - 2020-10-03T07:07:39+05:30 IST