జియోలో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడి

ABN , First Publish Date - 2020-05-18T07:02:40+05:30 IST

రిలయ న్స్‌ కంపెనీ తన డిజిటల్‌ విభాగం జియో లో 1.34 శాతం వాటా ను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌కు విక్రయించింది. ఈ డీల్‌ విలువ రూ. 6598.38 కోట్లు. నాలుగు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్రకటించిన...

జియోలో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడి

  • 1.34 శాతం వాటా విక్రయం
  • డీల్‌ విలువ రూ.6,598 కోట్లు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ కంపెనీ తన డిజిటల్‌ విభాగం జియో లో 1.34 శాతం వాటా ను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ  జనరల్‌ అట్లాంటిక్‌కు విక్రయించింది. ఈ డీల్‌ విలువ రూ. 6598.38 కోట్లు. నాలుగు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్రకటించిన నాలుగో భారీ డీల్‌ ఇది. ఈ నాలుగు డీల్స్‌తో కంపెనీలోకి మొత్తం 67,194.75 కోట్ల నిధులు వస్తాయి. ఫలితంగా కంపెనీపై రుణభారం తగ్గుతుంది. ఈ పెట్టుబడితో జియో విభాగం ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 కోట్లకు పెరుగుతుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు 20 శాతం వాటాలు కేటాయిస్తున్నట్టు రిలయన్స్‌ తెలిపింది. అందులో ఇప్పటివరకు 14.8 శాతం వాటాలు విక్రయించినట్టు పేర్కొంటూ, త్వరలో మరిన్ని పెట్టుబడులు రానున్నట్టు తెలియచేసింది. 2021 నాటికి కంపెనీని రుణరహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ గత ఆగస్టులో ప్రకటించారు. 

 

ఫేస్‌బుక్‌ డీల్‌తో పాటు సౌదీ అరామ్కో వంటి కంపెనీలు, ఇతర ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) కంపెనీలకు వాటాల విక్రయంతో ఈ ఏడాది డిసెంబరు నాటికే ఆ లక్ష్యాన్ని చేరగలమని కంపెనీ విశ్వాసం ప్రకటించింది. కొన్ని దశాబ్దాల నుంచి జనరల్‌ అట్లాంటిక్‌ తనకు తెలుసునని, భారతదేశంలో గల భారీ అవకాశాలపై ఆ కంపెనీకి అపార విశ్వా సం ఉన్నదని చెబుతూ ఆ కంపెనీకి ఉన్న అంతర్జాతీయ అనుభవం, వ్యూహాత్మక దృష్టి జియోకు ఎంతో ఉపయోగకరం అవుతుందని భావిస్తున్నట్టు ముకేశ్‌  అంబానీ చెప్పారు. డిజిటల్‌ కనెక్టివిటీ భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలుస్తుందన్న అంశంపై ముకేశ్‌కు గల కట్టుబాటు అపారమైనదని, దేశంలో డిజిటల్‌ విప్లవం తీసుకురావడంలో జియో ముందు వరుసలో నిలుస్తున్నదని జనరల్‌ అట్లాంటిక్‌ సీఈఓ బిల్‌ ఫోర్డ్‌ అన్నారు.


Updated Date - 2020-05-18T07:02:40+05:30 IST