మళ్లీ పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర 15 రోజుల్లో రెండోసారి...

ABN , First Publish Date - 2020-12-15T22:08:11+05:30 IST

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది.ఐదు కిలోల షార్ట్ సిలిండర్ ధర రూ. 18 మేరకు, 19 కిలోల సిలిండర్ ధర రూ. 36.50 మేరకు పెరిగాయి.

మళ్లీ పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర  15 రోజుల్లో రెండోసారి...

న్యూఢిల్లీ : లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది.ఐదు కిలోల షార్ట్ సిలిండర్ ధర రూ. 18 మేరకు, 19 కిలోల సిలిండర్ ధర రూ. 36.50 మేరకు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(ఐఓసీ) వివరాల ప్రకారం నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 694, కోల్‌కతాలో రూ. 720.50, ముంబైలో రూ. 694, చెన్నైలో రూ. 660 కు పెరిగాయి. అంతకుముందు ఢిల్లీలో రూ. 594, కోల్‌కతాలో రూ. 620.50, ముంబైలో రూ. 594, చెన్నైలో రూ. 610 గా ఉన్నాయి. ఇప్పుడు రూ. 50 చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో వరుసగా రూ. 696.50, రూ. 854గా ఉన్నాయి. 

ప్రభుత్వరంగ కంపెనీలు ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయన్న విషయం తెలిసిందే. కాగా... ఇప్పుడు మాత్రం పదిహేను రోజుల్లో వ్యవధిలోనే సిలిండర్ ధర రెండోసారి పెరిగింది. డిసెంబరు 2 న గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. తాజాగా... మంగళవారం మరో రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 


మొత్తంమీద గ్యాస్ ధర ఈ పదిహేను రోజుల్లో రూ. 100 పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 54.50 పెరిగి ఢిల్లీలో రూ. 1,296 కి చేరుకుంది. 

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర...

ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్  ఇతర వంట గ్యాస్ సిలిండర్ల పై కూడా పెంపును ప్రకటించాయి. ఐదు కిలోల సిలిండర్‌పై తాజాగా రూ. 18 పెంచాయి. ఇక... 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పైన రూ. 36.50 మేరకు పెంచాయి. కమర్షియల్ సిలిండర్ ధర కూడా ఈ పదిహేను రోజుల్లో దాదాపు రూ. 100 వరకు పెరిగింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. మొత్తంమీద తరచూ పెరిగిపోతోన్న గ్యాస్ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. 


Updated Date - 2020-12-15T22:08:11+05:30 IST