దివాలా చట్టంలో మరిన్ని మార్పులు

ABN , First Publish Date - 2020-11-26T08:08:46+05:30 IST

ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌ర ప్ట్‌సీ బోర్డు ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) దివాలా చట్టంలో మరిన్ని మార్పులు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 15లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరింది

దివాలా చట్టంలో మరిన్ని మార్పులు

న్యూఢిల్లీ: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌ర ప్ట్‌సీ బోర్డు ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) దివాలా చట్టంలో మరిన్ని మార్పులు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 15లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరింది. స్వచ్ఛందంగా దివాలా ప్రక్రియలో ఉన్న ఒక కంపెనీ, ఆ ప్రక్రియ నుంచి ఉపసంహరించుకునేందుకు సంబంధించి ప్రతిపాదనలు చేసింది.


అవేమిటంటే..

  • దివాలా కేసును విచారిస్తున్న సంస్థ నుంచి ముందస్తు అనుమతితో ఉపసంహరణ 
  • కొన్ని షరతులకు లోబడి మాత్రమే కేసు ఉపసంహరణకు అనుమతి
  • ప్రత్యేక తీర్మానం ద్వారానే దివాలా ప్రక్రియ నుంచి ఉపసంహరణకు దరఖాస్తు  
  • కంపెనీ ఆస్తుల అమ్మకం లేకపోతే రుణదాతల్లో మూడింత రెండు వంతుల మంది ఆమోదం ఉండాలి.

Updated Date - 2020-11-26T08:08:46+05:30 IST