‘ఫావిలో’ ఉచిత హోమ్‌ డెలివరీ

ABN , First Publish Date - 2020-08-22T07:17:53+05:30 IST

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ చికిత్సకు వినియోగించే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌

‘ఫావిలో’ ఉచిత హోమ్‌ డెలివరీ

త్వరలో 400 ఎంజీ టాబ్లెట్‌: ఎంఎ్‌సఎన్‌ 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ చికిత్సకు వినియోగించే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ ఉచితంగా ఇంటికే డెలివరీ చేయనుంది. ‘ఫావిలో’ బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఫావిపిరావిర్‌ ఔషధాన్ని 170కి పైగా పట్టణాల్లో హోమ్‌ డెలివరీ చేయనున్నట్లు ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ సీఎండీ ఎంఎ్‌సఎన్‌ రెడ్డి తెలిపారు.


రోగులకు ఇంటి వద్దే ఔషఽధాన్ని డెలివరీ చేయడానికి రిటైల్‌ ఫార్మసీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 200 ఎంజీ మోతాదు టాబ్లెట్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఒక్కో టాబ్లెట్‌ రూ.33కు అమ్ముతోంది.  రోగులపై భారాన్ని తగ్గించడానికి త్వరలోనే 400 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేయనున్నట్లు రెడ్డి చెప్పారు. 


Updated Date - 2020-08-22T07:17:53+05:30 IST