చైనాకు మార్కెట్ కోల్పోతాం
ABN , First Publish Date - 2020-05-13T06:43:32+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా సరఫరా వ్యవస్థ నిలిచిపోవడంతో ఫ్రాగరెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఫ్రాగరెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ చైనాకు పోటీ...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లాక్‌డౌన్ కారణంగా సరఫరా వ్యవస్థ నిలిచిపోవడంతో ఫ్రాగరెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఫ్రాగరెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ చైనాకు పోటీ ఇస్తోంది. చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు సాగుతున్నందున భారత పరిశ్రమ చైనాకు మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదం ఉందని భారత ఫ్రాగరెన్స్, ఫ్లేవర్స్ సమాఖ్య ప్రెసిడెంట్ రిషబ్ కొఠారీ తెలిపారు. సువాసనలు, రుచులిచ్చే పదార్థాల ఎగుతులు, దిగుమతుల్లో భారత్ ప్రధాన దేశాల్లో ఒకటన్నారు. భారత పరిశ్రమ పరిమాణం దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అంచనా. 1000 పైగా పరిశ్రమలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.