ఎఫ్‌పీఐల దూకుడు
ABN , First Publish Date - 2020-06-22T05:46:12+05:30 IST
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) కు భారత క్యాపిటల్ మార్కెట్ మళ్లీ ఆకర్షణీయంగా మారింది. వరుసగా మూడు నెలల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ వస్తున్న ఎఫ్‌పీఐలు...

న్యూఢిల్లీ: విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) కు భారత క్యాపిటల్ మార్కెట్ మళ్లీ ఆకర్షణీయంగా మారింది. వరుసగా మూడు నెలల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ వస్తున్న ఎఫ్‌పీఐలు జూన్ నెలలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.17,985 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ఈ నెల 1 నుంచి 19 తేదీల మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు రూ.20,527 కోట్ల పెట్టుబడులు పెట్టగా డెట్ విభాగం నుంచి రూ.2,569 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.