16 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పండుగ
ABN , First Publish Date - 2020-10-03T21:35:17+05:30 IST
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయి. ఈ నెల 16 నుంచి సేల్ ప్రారంభం కానుండగా 21 వరకు కొనసాగనుంది. ఎస్‌బీఐతో

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయి. ఈ నెల 16 నుంచి సేల్ ప్రారంభం కానుండగా 21 వరకు కొనసాగనుంది. ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్ ఆ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ రాయితీ ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు 15 నుంచే డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. బజాజ్ ఫిన్‌సెర్వ్ ఈఎంఐ కార్డులతో కొనుగోళ్లు జరిపేవారికి నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా చెల్లించే వారికి క్యాష్ బ్యాక్ లభించనుంది.
బిగ్ బిలియన్ డేస్ 2020 సేల్‌లో భాగంగా మొబైల్స్, టీవీలు, హోం అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలు, ఇతర వందలాది ఉత్పత్తులపై డీల్స్, రాయితీలు అందించనుంది. కిరాణా ఆన్‌బోర్డింగ్ కార్యక్రమాన్ని విస్తరించడంలో భాగంగా 50 వేల కిరాణా దుకాణాలను చేర్చుకున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అమెజాన్ కూడా తన వార్షిక ఫెస్టివల్ సేల్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను ప్రకటించినప్పటికీ తేదీలను ఇంకా వెల్లడించలేదు.