తొలి కేరళ మహిళా స్టార్టప్ వీఈఎస్... యూఎన్ ఏజెన్సీతో ఒప్పందం

ABN , First Publish Date - 2020-12-17T23:33:46+05:30 IST

‘సమర్ధ ఇంధన డ్రైవర్’లను గుర్తించడంలో, ఆచరణీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతున్న కేరళకు చెందిన మహిళా స్టార్టప్... ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాలతో మొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది. తిరువనంతపురానికి చెందిన వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్(వీఈఎస్) ఈ ఒప్పందంపై సంతకం చేసింది.

తొలి కేరళ మహిళా స్టార్టప్ వీఈఎస్... యూఎన్ ఏజెన్సీతో ఒప్పందం

తిరువనంతపురం: ‘సమర్ధ ఇంధన డ్రైవర్’లను గుర్తించడంలో, ఆచరణీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతున్న కేరళకు చెందిన మహిళా స్టార్టప్... ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాలతో మొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది. తిరువనంతపురానికి చెందిన వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్(వీఈఎస్) ఈ ఒప్పందంపై  సంతకం చేసింది. ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాల కోసం సంతకం చేసిన భారతదేశానికి చెందిన 170 కంపెనీలలో 64 కంపెనీలు ప్రైవేటు రంగానికి చెందినీవంటూ కంపెనీ చేసిన ప్రకటన ఈ సందర్బంగా వెల్లడించింది. 


వీఈఎస్.. భారతదేశం నుంచి 65 వ సంస్థ కావడమే కాకుండా కేరళ నుంచి యూఎన్‌తో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్న మొదటి సంస్థ. కాగా... ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాలను అమలు చేయడానికి కేరళ ఇప్పటికే నీతి ఆయోగ్ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. 


ఈ ఒప్పందంపై సంతకం చేసిన క్రమంలో... వీఈఎస్ లింగ సమానత్వం కోసం ఉన్నత స్థాయి కార్పొరేట్ నాయకత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అంతేగాకుండా... మహిళలు, పురుషులను పనిలో సమానంగా చూస్తుంది. 


మహిళలు, పురుష కార్మికుల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సుకు ఈ ఒప్పందం నేపధ్యంలో ప్రాధాన్యత లభిస్తుంది. పలు ఇతర అంశాలకు సంబంధించి ఆయా రంగాల్లో అనుభవమున్న, గల్ఫ్ సహా వివిధ దేశాలలో బహుళజాతి ప్రాజెక్టులలో పాలుపంచుకున్న అనూప్ బాబు అనే ఎన్ఆర్ఐ వీఈఎస్‌ను స్థాపించారు. సుదీర్ఘ పరిశోధనల తరువాత... అనూప్ బాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న అతని తల్లి ఇందిరా బాబు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కన్సల్టెన్సీ-కమ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సంస్థగా అవతరించిన వీఈఎస్... మహిళల సాధికారతను లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాకుండా... కేరళ రాష్ట్ర విద్యుత్తు బోర్డు ఇంధన సామర్థ్య విభాగంలో రిటైర్డ్ ఇంజనీర్ సుధా కుమారి వీఈఎస్ వ్యాపారాధిపతిగా ఉన్నారు. 


ఇ-మొబిలిటీ, వాతావరణ మార్పు, శక్తి ఆడిట్, ప్రాజెక్ట్ నిర్వహణ, కార్బన్ అకౌంటింగ్ రంగాలలో కన్సల్టింగ్, శిక్షణ, ఆర్ అండ్ డీలను వీఈఎస్ అందించనుది. ఢిల్లీకి చెందిన సీఐఐ-ఐటీసీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఫర్ సస్టైయినబుల్ డెవలప్‌మెంట్ సహకారంతో కేరళలో గ్రీన్ ఎనర్జీలో సర్టిఫైడ్ సాంకేతిక శిక్షణనందించే మొట్టమొదటి గుర్తింపు పొందిన సంస్థ వీఈఎస్‌ కావడం గమనార్హం. 


Updated Date - 2020-12-17T23:33:46+05:30 IST