‘ఫావిలో’ 400 ఎంజీ టాబ్లెట్స్‌

ABN , First Publish Date - 2020-09-18T05:51:35+05:30 IST

కొవిడ్‌ రోగుల చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్‌ ఔషధం ఫావిపిరావిర్‌ టాబ్లెట్లను ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ 400 ఎంజీ సామర్థ్యాల్లో విడుదల చేసింది...

‘ఫావిలో’ 400 ఎంజీ టాబ్లెట్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఒక మోస్తరు నుంచి తీవ్రత తక్కువగా ఉన్న కొవిడ్‌ రోగుల చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్‌ ఔషధం ఫావిపిరావిర్‌ టాబ్లెట్లను ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ 400 ఎంజీ సామర్థ్యాల్లో విడుదల చేసింది. ‘ఫావిలో-200’ పేరుతో గతంలో 200 ఎంజీ టాబ్లెట్లను కంపెనీ ప్రవేశపెట్టింది. రోజుకు రోగి తీసుకునే టాబ్లెట్ల భారాన్ని తగ్గించేందుకు ‘ఫావిలో-400’ దోహదం చేస్తాయని ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ సీఎండీ ఎంఎ్‌సఎన్‌ రెడ్డి తెలిపారు. ఫావిలో 200 ఎంజీ టాబ్లెట్లను రూ.33 ధరకే విక్రయిస్తున్న కంపెనీ ఈ టాబ్లెట్ల షెల్ఫ్‌ లైఫ్‌ను 3 నెలల నుంచి 6 నెలలకు పెంచింది.

Updated Date - 2020-09-18T05:51:35+05:30 IST