రూ.150 కోట్లతో ఈటీఓ
ABN , First Publish Date - 2020-11-03T05:38:24+05:30 IST
ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ఈటీఓ మోటార్స్.. తెలంగాణలో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది...
- ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన యూనిట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ఈటీఓ మోటార్స్.. తెలంగాణలో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కదుర్చుకుంది. అనుబంధ కంపెనీ కేటో మోటార్స్ ద్వారా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని ఈటీఓ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌కే రావల్ తెలిపారు. ఐదేళ్లలో రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్యాసింజర్, కార్గో త్రిచక్ర ఆటోలను ఇక్కడ తయారు చేస్తారు.