మరో 27 రంగాలకు పరపతి హామీ

ABN , First Publish Date - 2020-11-27T06:34:46+05:30 IST

అత్యవసర పరపతి హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) ప్రభుత్వం మరో 27 రంగాలకు విస్తరించింది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది

మరో 27 రంగాలకు పరపతి హామీ

న్యూఢిల్లీ: అత్యవసర పరపతి హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) ప్రభుత్వం మరో 27 రంగాలకు విస్తరించింది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం  రూ.2.65 లక్షల కోట్లతో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ మూడో దశ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ఆరోగ్యంతో సహా 27 రంగాలకు పరపతి హామీ కల్పించబోతున్నట్టు తెలిపింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి నెల రోజుల్లోగా రూ.50 నుంచి రూ.500 కోట్లలోపు రుణ బకాయిలు చెల్లించాల్సిన కంపెనీలు, వ్యాపార సంస్థలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం కింద రుణాల్ని ఐదేళ్లకు పొడిగిస్తారు. ఒక ఏడాది పాటు మారిటోరియం కూడా లభిస్తుంది.

Read more