మోసపోవద్దు... పాలసీదారులకు ఎల్‌ఐసీ హెచ్చరిక..!
ABN , First Publish Date - 2020-12-30T00:56:08+05:30 IST
ఎల్‌ఐసీ పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అందుకే వరిని పడితే వారిని నమ్మవద్దని జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) హెచ్చరించింది.
ముంబై : ఎల్‌ఐసీ పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అందుకే వరిని పడితే వారిని నమ్మవద్దని జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) హెచ్చరించింది. వివరాలిలా ఉన్నాయి.
దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసీతాజాగా తన పాలసీదారులను హెచ్చరించింది. మోసపోవద్దంటూ అలర్ట్ చేసింది.
ఎల్ఐసీ అధికారులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఐఆర్‌డీఏఐ అధికారులు, ఈసీఐ అధికారులమని చెప్పుకుంటూ ఎల్‌ఐసీ పాలసీదారులను మోసం చేయొచ్చని ఎల్‌ఐసీ కస్టమర్లను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నిఎల్‌ఐసీ వెల్లడించింది.
పాలసీలకు సంబంధించిన బోనస్ సంబంధిత వివరాలను ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేయదని ఎల్‌ఐసీ తన పాలసీదారులకు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎల్‌ఐసీ పాలసీదారులను ప్రస్తుత పాలసీలను మానుకోమని, లేదంటే నిలిపివేయాలని కోరదని స్పష్టం చేసింది.