‘డోమినోస్’ బిర్యానీ...

ABN , First Publish Date - 2020-12-17T23:01:51+05:30 IST

బిర్యానీ ప్రియుల కోసం 'ఏక్‌దమ్' బిర్యానీ పేరుతో ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చైన్ డామినోస్ పిజ్జా సిద్ధమైంది. ఈ మేరకు జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ బిర్యాని మొదట గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో లభిస్తుందని, ఆ తర్వాత ఢిల్లీలో ప్రారంభిస్తామని వెల్లడించింది.

‘డోమినోస్’  బిర్యానీ...

ముంబై : బిర్యానీ ప్రియుల కోసం 'ఏక్‌దమ్' బిర్యానీ పేరుతో ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చైన్ డామినోస్ పిజ్జా సిద్ధమైంది.  ఈ మేరకు జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ బిర్యాని మొదట గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో లభిస్తుందని, ఆ తర్వాత ఢిల్లీలో ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ సేవలు యాప్, వెబ్ సైట్‌లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. 


హైదరాబాద్ బిర్యానీ, లక్నో నవాబ్ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీ వంటి 20 రకాల బిర్యానీలను కస్టమర్లకు అందించనున్నట్లు జుబిలాంట్ ఫుడ్ వర్స్క్స వెల్లడించింది. వెజ్, నాన్-వెజ్ వంటలను వేరువేరుగా అందిస్తామని తెలిపింది. వీటితో పాటు కబాబ్స్, స్వీట్స్ కూడా ఉంటాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 


చెక్కుచెదరని, పర్యావరణహితమైన ప్రత్యేక దమ్ సీలుతో ఈ బిర్యానీని అందించనున్నారు. రూ. 99 నుండి వీటి ధరలు ప్రారంభం కానున్నాయి. జుబిలాంట్ ఫుడ్ వర్క్స్‌కు దేశవ్యాప్తంగా 280 కి పైగా పట్టణాలు, నగరాల్లో డామినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. 


బిర్యానీకీ దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో 2017 నుండి ఎక్కువగా వీటినే ఆర్డర్ చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. షేర్ 5 శాతానికి పైగా జంప్


కాగా... బిర్యానీ రంగంలోకి జుబిలాంట్ ఫుడ్ వర్స్క్ ప్రవేశించడంతో  కంపెనీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఓ సమయంలో షేర్ 10 శాతానికి పైగా ఎగబాకి రూ. 2,922 కు చేరుకోవడం గమనార్హం. ఈ క్రమంలో... పదమూడు నెలల గరిష్టాన్ని నమోదు చేసి,  చివరకు 5.56 శాతం లాభంతో రూ. 2,825 వద్ద ముగియడం విశేషం.  గురువారం ఒక్కరోజే షేర్ రూ. 148 కి పైగా లాభపడటం గమనార్హం.


Updated Date - 2020-12-17T23:01:51+05:30 IST