ప్రైవేటు బ్యాంకుల్లో సొమ్ము భద్రం
ABN , First Publish Date - 2020-03-13T08:48:24+05:30 IST
ప్రైవేటు బ్యాంకుల నుంచి డిపాజిట్లను ఉపసంహరించవద్దని ఆర్బీఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అలాంటి చర్యలు బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై ...

డిపాజిట్లు ఉపసంహరించొద్దు: ఆర్బీఐ
న్యూఢిల్లీ, మార్చి 12: ప్రైవేటు బ్యాంకుల నుంచి డిపాజిట్లను ఉపసంహరించవద్దని ఆర్బీఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అలాంటి చర్యలు బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంది. అలాంటి నిర్ణయాలపై వెంటనే పునరాలోచన చేయాలని కోరింది. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ల భద్రతపై ఆందోళనలు పూర్తిగా అసంబద్ధమంటూ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శు(సీఎ్‌స)లకు లేఖలు రాసింది.
యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఆ బ్యాంకు బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. నగదు ఉపసంహరణ(విత్‌డ్రా)పై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఆ పరిణామం అనంతరం ప్రైవేటు బ్యాంకుల్లోని డిపాజిట్లను ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి మళ్లించాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని సంస్థలకు సూచించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ లేఖలు రాసింది.