సరికొత్త రికార్డు సృష్టించిన డీమార్ట్ యజమాని
ABN , First Publish Date - 2020-02-15T18:58:39+05:30 IST
డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్ దమాని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో...
డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ తర్వాత రెండో స్థానంలో డీమార్ట్ యజమాని రాధాకిషన్ దమాని నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ జాబితా ప్రకారం.. దమని మొత్తం ఆస్తి 17.9 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీ 57.9 బిలియన్ డాలర్లతో భారత్‌లోనే కాదు ఆసియాలోనే సంపన్నుడిగా నిలిచారు.