74 శాతం తగ్గిన సైయెంట్‌ లాభం

ABN , First Publish Date - 2020-05-08T07:07:46+05:30 IST

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సైయెంట్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.46.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటిచింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం...

74 శాతం తగ్గిన సైయెంట్‌ లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మార్చితో ముగిసిన త్రైమాసికంలో సైయెంట్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.46.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటిచింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం (రూ.176 కోట్లు) 74 శాతం తగ్గింది. త్రైమాసిక సమీక్షా కాలం లో మొత్తం ఆదా యం కూడా రూ. 1,241.8 కోట్ల నుంచి రూ.1,127.5 కోట్లకు తగ్గింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభం రూ.341.20 కోట్లుగా నమోదైంది. కోవిడ్‌-19 ప్రభావంతో ఆదాయం, మార్జిన్ల పరంగా అంచనాలకు చేరలేకపోయామని సైయెంట్‌ ఎండీ, సీఈఓ  బీ కృష్ణ తెలిపారు. కాగా మొత్తం చెల్లించిన మూలధనంలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల వాటా పరిమితిని ప్రస్తుతమున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని బోర్డు నిర్ణయించింది. 


Updated Date - 2020-05-08T07:07:46+05:30 IST