మళ్లీ చమురు మంట!

ABN , First Publish Date - 2020-04-14T06:42:03+05:30 IST

ముడి చమురు ధర మళ్లీ మండే సూచనలు కనిపిసున్నాయి. మే, జూన్‌ నెలల్లో రోజువారీ చమురు ఉత్పత్తిని 97 లక్షల పీపా ల మేర తగ్గించేందుకు రష్యాతో పాటు సౌదీ అరేబియా నాయకత్వంలోని ‘ఒపెక్‌’ దేశాలు...

మళ్లీ చమురు మంట!

  • ఉత్పత్తిలో కోతకు ఓకే


వియన్నా: ముడి చమురు ధర మళ్లీ మండే సూచనలు కనిపిసున్నాయి. మే, జూన్‌ నెలల్లో రోజువారీ చమురు ఉత్పత్తిని 97 లక్షల పీపా ల మేర తగ్గించేందుకు రష్యాతో పాటు సౌదీ అరేబియా నాయకత్వంలోని ‘ఒపెక్‌’ దేశాలు అంగీకరించాయి. పడిపోతున్న ధరలను కట్టడి చేసేందుకు చమురు ఉత్పత్తి దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ ముడి చము రు ఉత్పత్తిని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 5 శాతం నుంచి 7.7 శాతం వరకు పెరిగింది. పీపా బ్రెంట్‌ రకం ముడి చమురు 5 శాతం పెరిగి 33.08 డాలర్లకు చేరింది.  అయితే  కరోనా వైరస్‌ దెబ్బతో రోజువారీ డిమాండ్‌ ఏప్రిల్‌లో 2.7 కోట్ల పీపాలు, మేలో రెండు కోట్ల పీపాల మేర తగ్గే అవకాశం ఉన్నందున, ధరలు పెద్దగా పెరగక పోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


Updated Date - 2020-04-14T06:42:03+05:30 IST