దిద్దుబాటు పొంచి ఉంది..
ABN , First Publish Date - 2020-08-22T07:12:35+05:30 IST
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ మదుపరులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు.
జర జాగ్రత్త
ఆర్‌బీఐ గవర్నర్ దాస్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ మదుపరులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా పెరుగుతున్న సూచీలకు ‘దిద్దుబాటు’ (కరెక్షన్) తప్పదన్నారు. అయితే ఈ దిద్దుబాటు ఎపుడనే విషయం చెప్పడం కష్టమన్నారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాస్ ఈ హెచ్చరిక చేశారు.
అంతర్జాతీయంగా నిధుల లభ్యత భారీగా పెరగడమే ప్రస్తుత స్టాక్ మార్కెట్ జోరుకు కారణమన్నారు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికపుడు గమనిస్తున్నట్టు చెప్పారు. మార్కెట్ పతనంతో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.