ప్రతికూలతలోనూ చెదరని ఆత్మస్థైర్యం

ABN , First Publish Date - 2020-07-22T06:02:17+05:30 IST

భారత వ్యాపార సంస్థలు కొవిడ్‌-19 ప్రభావాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగాయని, వాటిలో ఆత్మస్థైర్యం ప్రపంచంలోనే అధికంగా ఉన్నదని ఒక సర్వేలో తేలింది...

ప్రతికూలతలోనూ చెదరని ఆత్మస్థైర్యం

  • భవిష్యత్తుకు సన్నద్ధమంటున్న భారత వ్యాపార సంస్థలు


న్యూఢిల్లీ: భారత వ్యాపార సంస్థలు కొవిడ్‌-19 ప్రభావాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగాయని, వాటిలో ఆత్మస్థైర్యం ప్రపంచంలోనే అధికంగా ఉన్నదని ఒక సర్వేలో తేలింది. ఇటీవలి పరిణామాల ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు, భవిష్యత్తుకు సన్నద్ధం అయ్యేందుకు అనుబంధ ప్రణాళికలతో అవి సిద్ధంగా ఉన్నాయని హెచ్‌ఎ్‌సబీసీ నావిగేటర్‌ నివేదిక సూచించింది. మొత్తం 14 ప్రపంచ శ్రేణి మార్కెట్లలో 2600 కంపెనీలపై ఈ సర్వే నిర్వహించగా వాటిలో భారతీయ కంపెనీలు 200 ఉన్నాయి. ‘‘మరింత చురుకైన పాత్రకు సంసిద్ధత’’ పేరిట రూపొందించిన ఆ నివేదిక ముఖ్యాంశాలు...

  1. కొవిడ్‌-19 ప్రభావం 46 శాతం వ్యాపార సంస్థలపై  తీవ్రంగా ఉంది. కాని వాటిలో 54 శాతం సంస్థలు భవిష్యత్తులో తిరిగి సాధారణ కార్యకలాపాలు సాగించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి
  2. ఇప్పటివరకు వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వేలో అత్యం త గరిష్ఠ విశ్వాస స్థాయి ఇదే. భవిష్యత్‌ సంసిద్ధత విషయంలో ప్రపంచ స్థాయి సగటు 45 శాతం ఉంది 
  3. కొవిడ్‌-19 ప్రభావానికి తీవ్రంగానే లోనైనప్పటికీ తిరిగి సాధారణ కార్యకలాపాలు సాగిస్తున్నామని 29 శాతం కంపెనీలు ప్రకటించాయి. ఇది కూడా ప్రపంచంలో గరిష్ఠ స్థాయి. కాని చైనా కన్నా తర్వాతి స్థానం 
  4. తమ యాజమాన్యాలు ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనగల శక్తి కలిగి ఉన్నాయని, సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సద్దుబాట్లు చేసుకోగలవని 73 శాతం కంపెనీలు తెలిపాయి  
  5. భవిష్యత్తులో ఏర్పడబోయే అస్థిరతలను ఎదుర్కొనగల శక్తి తమ సరఫరాదారులకు ఉందా అన్న విషయాన్ని 42 శాతం కంపెనీలు సమీక్షిస్తున్నాయి. 64 శాతం కంపెనీలు ప్రస్తుత పరిస్థితిని తమ ఉత్పత్తులు, సేవల మెరుగుదలకు ఒక అవకాశంగా భావిస్తున్నాయి. 

Updated Date - 2020-07-22T06:02:17+05:30 IST