కరోనా కలవరం

ABN , First Publish Date - 2020-09-25T06:02:10+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,114.82 పాయింట్లు (2.96 శాతం) క్షీణించి 36,553.60 వద్దకు పడిపోయింది...

కరోనా కలవరం

  • స్టాక్‌ సూచీల భారీ పతనం .. సెన్సెక్స్‌ 1,115 పాయింట్లు డౌన్‌
  • 11,000 దిగువకు నిఫ్టీ.. రూ. 3.95 లక్షల కోట్లు ఫట్‌  


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,114.82 పాయింట్లు (2.96 శాతం) క్షీణించి 36,553.60 వద్దకు పడిపోయింది. ఈ ఏడాది మే 4న 2,000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌కు మళ్లీ ఇదే అతిపెద్ద ఒక్కరోజు నష్టం. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 326.30 పాయింట్లు (2.93 శాతం) నష్టపోయి 10,805.55 వద్ద ముగిసింది. తత్ఫలితంగా సెన్సెక్స్‌ 37,000, నిఫ్టీ 11,000 దిగువకు పడిపోయినట్లైంది. అంతేకాదు, సెన్సెక్స్‌ జూలై 10, నిఫ్టీ జూలై 13 నాటి ముగింపు స్థాయికి జారుకున్నట్లైంది. అంటే, గడిచిన రెండున్నర నెలల్లో సూచీలు గడించిన లాభాలన్నీ హరించుకుపోయాయన్నమాట. గురువారం సెషన్‌లో బ్లూచి్‌పలతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించారు. దాంతో, బీఎ స్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 2.14 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2.28 శాతం తగ్గాయి. దీంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.3.95 లక్ష ల కోట్లు తగ్గి రూ. 148,76,217 కోట్లకు పరిమితమైంది. 


సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 29 నష్టాల్లోనే ముగిశాయి. కేవలం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ మాత్రమేస్వల్ప లాభాన్ని నమోదు చేసింది. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 7.10 శాతం క్షీణతతో  టాప్‌ లూజర్‌గా నిలిచింది. 


నష్టాలకు కారణాలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలందడంతో దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. ఐరోపా దేశాలను రెండో విడత కరోనా వ్యాప్తి భయాలు అలుముకున్నాయి. వైరస్‌ కట్టడికి ఇప్పటికే కొన్ని దేశాలు తాజాగా ఆంక్షలు విధించాయి. దీంతో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై అనిశ్చితి నెలకొంది. 


6 రోజులు ..11.31 లక్షల కోట్ల నష్టం 

వరుసగా ఆరు రోజులుగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ 6 ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 2,749.25 పా యింట్లు, నిఫ్టీ 799 పాయింట్లు క్షీణించింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీలన్నింటి మార్కెట్‌ విలువ రూ.11.31 లక్షల కోట్లు తగ్గింది. 


రూ.50వేల దిగువకు బంగారం!

కొన్ని నెలలపాటు భగ్గుమన్న బంగారం ధరలు.. క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత పసిడి రూ.50,000 దిగువకు జారుకుంది. గురువారం ముంబై స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.49,822గా నమోదైంది. 22 క్యారెట్ల రేటు రూ.49,623 పలికింది. కిలో వెండి రూ.56,471 వద్ద ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగానూ ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 1,854 డాలర్లు, సిల్వర్‌ 22.12 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 

Updated Date - 2020-09-25T06:02:10+05:30 IST