అన్ని ఆడిట్ సంస్థలపైనా నియంత్రణ: ఇంజేటి శ్రీనివాస్
ABN , First Publish Date - 2020-03-16T06:29:01+05:30 IST
దేశంలో ఆడిట్ సేవలందించే ఏ సంస్థ అయినా దేశీయ నియంత్రణలకు లోబడి ఉండాల్సిందేనని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్...
న్యూఢిల్లీ : దేశంలో ఆడిట్ సేవలందించే ఏ సంస్థ అయినా దేశీయ నియంత్రణలకు లోబడి ఉండాల్సిందేనని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. డెలాయిట్, కేపీఎంజీ, పీడబ్ల్యుసీ,ఈవై వంటి బహుళజాతి ఆడిటింగ్ సంస్థలపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేదని వార్తలు వస్తున్న సమయంలో ఈ విషయం చెప్పడం విశేషం. దేశంలో ఆడిట్ సేవలు అందించే ఏ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అయినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్డర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) దగ్గర నమోదైతేనే, వారిని ఆడిటింగ్‌కు అనుమతిస్తున్న విషయాన్ని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఐసీఏఐ దగ్గర నమోదైన వ్యక్తులతో కలిసి పరిమిత భాగస్వా మ్య కంపెనీలుగా ఏర్పడ్డాకే విదేశీ ఆడిట్ సంస్థలు దేశంలో ఆడిట్ సేవలందిస్తున్నట్టు చెప్పారు.